ఇది ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి వ్రాసింది కాదు.కేవలం మన జాగృతి కొసమే.
పొద్దున్నే పేపరు తీసుకుని సదరు సుబ్బరావు పక్కింటి పాపారావు తో ' ఛ ఛ ఛ ఛ .. పేపరు తీస్తే చాలు అన్నీ దరిద్రాలే. ఎనిమిది వేల కోట్ల స్కాము ట , విన్నావురా ?
ఈ రాజకీయ నాయకులంతా ఇంతే కద రా ..అన్నాడు మన పాపారావు.
నిజం చెప్పాలంటే ఈ రకమైన నిట్టూర్పులు అందరం విడిచేవే.ఈ రాజకీయ చెత్త అంటూ అందరం అన్ని రకాలుగా దుమ్మెత్తి పొసేదే.కానీ నిజం మట్లాడితే మనం నిస్సహాయులమా? మన భారత రాజ్యాంగం ప్రకారం మన నాయకులని మనమే ఎన్నుకుంటాం. కానీ మనం ఎక్కడ ఓడిపోతున్నాం ? ఎందుకు మన స్వార్జితం పన్నుల రూపం లో హరించుకుపోతుంది ? ఎవరికైనా లాభం చేకూరుతుందా ?
ఆలొచిస్తే నాకు కనిపించిన లోపాలు కొన్ని ఉన్నాయి.
ఈ నా ఆలొచనలతో ఏకిభవించేవారు చాలా వరకు ఓటు వేయటం లేదు. కారణం ఏదైనా కావచ్చు. వారు సదరు నియోజకవర్గం లో లేకపోయిఉండచ్చు . వారికి ఓటు హక్కు లేకపోయి ఉండచ్చు. ఉన్నా వేయాలని అనిపించకపోవచ్చు.వేస్తే ఎవరికి వేయాలి అన్న ప్రశ్న కి సమాధానం దొరకకపోఇ ఉండచ్చు. ఇలాంటి కారణాలు ఎన్ని ఉన్నా చదువుకునే వారు వేసే ఓట్ల శాతం 50 కి మించదు. చదువుకోని వారు, ఆ పూట గడిస్తే చాలు అనుకునే వారు , దారిద్ర్య రేఖ అన్న పదానికే చాలా దూరం ఉన్న వారు , ఆ పూట గడిచేలా సాయం ఎవడు చేస్తే వాడికే పట్టం కట్టిస్తాడు. అవునండి, ఇది అక్షర సత్యం. ఉదాహరణ కి ఒక రోజువారీ కూలీ ని తీసుకొండి. వాడు ఎవడు ఎక్కువ ఇస్తాడో వాడికే ఓటు వేస్తాను అంటాడు. ఏమైనా అంటే, ఎవడు వస్తే మాత్రం నా బ్రతుకు మారుతుంది అంటాడు. అవును మరి, వాడికెందుకు ఆ నాయకుడు ఎంత తింటే ? ఎంత నేర చరిత కలిగిన వాడైతే ? ఎన్ని జీవితాలు నాశనం చేసి ఉంటే ? వీరి వాదన లొ తప్పు ఉందా ? ఈ ప్రశ్న కి మన దగ్గర సమధానం ఉందా ?
ఇక ఇంకో రకం. వీరిని రెందు రకాలుగా చెప్పచ్చు.సొదాహరణంగా వివరించే ప్రయత్నం చేస్తాను.
ఒక బస్టాండు లో ఒక వ్యక్తి బస్ కోసం ఎదురు చుస్తున్నాడు. అక్కడే ఉన్న ఒక దొంగ వాడి పర్సు కొట్టేసాడు. పర్సు పోయింది అని తెలుసుకున్న వ్యక్తి గాభరా పడుతుంటే, ఆ దొంగే వచ్చి, నీ పర్సు పోయింది కదా, ఇదిగో అంటూ వాడి పర్సు లో నుండే ఒక పది రూపాయలు ఇచ్చాడు.దానికి చలించి పొయిన ఆ మనిషి జీవితాంతం ఆ దొంగ ని తన దేవుడి లా పూజించాడు.వాడు నడి వీధి లో ఒక హత్య చేసినా, వాడి రుణం తీర్చుకునే ప్రయత్నం చేసాడు.ఒక రోజున ఆ మనిషికి నిజం తెలిసింది. ఐనా కుడా ఆ మాత్రం మంచి మనసు యే దొంగ కి ఉంటుంది అని సర్దిచెప్పుకున్నాడు. ఈ రకమైన రుణగ్రస్తులు మన దగ్గర అనేకం !!
ఇక రెండో రకం పుచ్చుల్లొ నాకు నచ్చిన నేను మెచ్చిన పుచ్చులు ఏరుకునే రకం. లేదా ఈ కూరగాయల్లొ తక్కువ పుచ్చులు ఉన్నాయి అని ఏరుకునే రకం.వాడు మా సామజిక వర్గం వాడు, వాడు మా కులం వాడు, వాదు మా మతం వాడు అంటూ వాడి చరిత్ర ఎలాంటిదైనా వాడికి పగ్గం కట్టెయ్యటం. వాడు అందరిలోకి తక్కువ తిన్నాడు రా, అందుకే వాడికే వేద్దాం అనుకుంటున్నాను అనుకుంటూ ఓటు వేసెయ్యటం.
మనమే ఇలా ఉన్నప్పుడు, మన వ్యవస్థ మారాలి అని ఎలా అనుకుంటున్నాం ?
ఫిలాసఫీ బగానే చెప్పావు గానీ,దీనికి పరిష్కారం ఏమైనా ఉందా అని నన్ను అడగకండి.ఆలొచించండి.
కులపిచ్చి మతపిచ్చి మనను వంద రకాలుగా వెనక్కి తోస్తూ ఉంటే,మనం ముందుకి ఎలా సాగుతాం ?అలా విశ్వసించటం కూడా వెర్రితనమే అవుతుంది.మన సమాజం , మన బాధ్యత అనుకున్నప్పుడే ఏమైనా సాధించగలం.సమాజం కన్నా సామజికవర్గమే మిన్న అనుకుంటే ఏం చేస్తాం అన్నయ్యా ?
మన చదువు మన విఙ్ఞతని చంపకూడదు. బాధ్యత గల పౌరులుగా మన హక్కు ని విస్మరించకూడదు.
భారతదేశం లో ఉన్న వాళ్ళు యే మూల ఉన్నా మీ మీ ఈ సారి ఓటు హక్కు వినియోగించుకొండి.దాన్ని మన జీవితం బాగుపడేలా వాడండి.
ఇది కేవలం ఓటు కాదు, మన చేతుల్లొ ఉన్న బ్రహ్మాస్త్రం.
మన దేశం, మన బాధ్యత, మన హక్కు .. మన చేతుల్లొ !!
వందేవంద్యం
రామకృష్ణ

.jpg)