నా బ్లాగ్స్ అన్నీ కుడా తెలుగు లో నే ఉంటాయి . గ్రాంధికం కాదు కేవలం వ్యావహారిక తెలుగు మత్రమే . మధ్య మధ్య లో ఇంగ్లీష్ వాడుతుంటాను , ఆ విషయం చూపించి దెప్పకండి .చెప్పాను కదా ఇది కేవలం మన వ్యావహారిక భాష మాత్రమే అని .
"వృక్షో రక్షతి రక్షితః "
చాలా చిన్నతనం నుండి చదువుకున్న ఒక నీతి . కాకపోతే ఎన్నడు మనం పెద్దగా పట్టించుకోని నీతి .
రోజూ మన భాగ్య నగరం రోడ్లను తిట్టుకునే వాడిలో నేను ఒకడినే . బండి తీసి బయటకి వచ్చామా ఈ కాలుష్యం దెబ్బకి చర్మం నల్లబడే ఒక సగటు జీవులే అంతా కూడా .
వెదికితే అడవి అనే కాదు. ప్రతీ చెట్టులోను ఆ ప్రకృతి కనిపిస్తుంది. ఓక రోజా పువ్వు, ఒక మల్లె మొగ్గ, ఒక బంతి పూల మొక్క, ఒక తులసి చెట్టు .. ఇవన్ని మనం నిత్యం చుసేవి , చూసి ఒక ప్రశాంతమైన ఊపిరి తీసుకుని , కళ్ళతో నే వాటిని అభినందించి మన నిత్య కర్మలకి సాగిపొతుంటాం.
అలంటి కొన్ని మొక్కలు మన జీవితం లొ ఒక చిన్న స్పర్శ ని మిగులుస్తాయి. దానికి నీరు పొయటం దగ్గర నుండి , ఒక పువ్వు పూస్తే ఒచ్చే అనందం అంతా ఇంతా కదు . అనుభవపుర్వకంగా చెప్తున్నదే .
ఇంటికి ఒక మొక్క, ఎదైనా కాని .. ఒక్కటంటే ఒక్క మొక్క, ప్రేమగా పెంచుకుంటే, మన భాగ్యనగరం లొ ని కాలుష్యం కొంతవరకైనా తగ్గించవచ్చు అనేది నా అభిప్రాయం .
ప్రశ్నించే అర్హత ఉన్న ప్రతీ మహనుభావుడు నన్ను అడగవచ్చు .. ఆ ఒక్క మొక్కతో ఎం అవుతుంది అని .. సముద్రంలొ నుండి ఒక చెంబు తీస్తే సముద్రానికి తెలియకపొవచ్చు .. కాని .. ఆ చెంబు నీరు ఐతే కచ్చితంగా తగ్గుతుంది కదా .. ఆశావహ దృక్పధం తో ఆలోచిస్తే అన్ని సాధ్యమే ..
మన దేశం , మన నగరం , మన ఆరోగ్యం .. మన వంతు సాయం .. మన ప్రకృతి కోసం .. మన అనందం కొసం .
No comments:
Post a Comment